![]() |
![]() |
.webp)
జోడీస్ మధ్య గొడవ పెట్టడంలో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ముందుంది. రీసెంట్ ఎపిసోడ్ లో నటరాజ్ మాష్టర్ - నీతూ, ప్రియాంక - శివ్ జోడి మధ్య ఫుల్ ఫైట్ జరిగింది. ఇక లవ్ గురు ఇచ్చిన టాస్క్ లో వీళ్ళు గట్టిగా యుద్ధం చేసుకున్నారు. "గేమ్ సరిగా ఆడకపోతే ప్రియాంక మీద నువ్వు మండిపడుతున్నావ్ . నీ అగ్రేషన్ ని ఆపడానికి ప్రియాంక చాలా కష్టపడుతోంది అది చూసి నాకు చాలా బాధ కలుగుతోంది " అంటూ నటరాజ్ మాష్టర్ చెప్పారు. ఇక అక్కడినుంచి ఈ రెండు జోడీలు మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. అది గట్టిగా అరుచుకుని కొట్టుకునేంత స్థాయికి వెళ్ళింది. "ఇన్ని రోజులు ఉండి ఈరోజే ఎందుకు అనిపించింది అంటూ " శివ్ అడిగాడు. "నేను చూసిన ప్రతీసారి అదే జరిగింది. నువ్వు చేసిన తప్పులు కౌంట్ లెస్. నీ కోపాన్ని హ్యాండిల్ చేయలేకపోతోంది ప్రియాంక " అన్నాడు నటరాజ్ మాష్టర్. " ఒక పార్టనర్ గా ఉన్నప్పుడు కోపాన్ని కూడా హ్యాండిల్ చేయాలి" అన్నాడు శివ్. "ఒక్కసారి కూడా మీరు మా పేరు రాయలేదు. సెకండ్ వీక్ మీ వల్లనే మేము వీక్ అయ్యాము.
డెసిషన్ మేకింగ్ మీకు వదిలేయడం వల్ల మేము వెనకబడ్డాం . రెండో సారి నా మొహమాటం వల్లనా మీతో టీమ్ అవ్వాల్సి వచ్చింది. దాని వలన కూడా మేము నష్టపోయాం. మీరెలా ఉంటారంటే ఎవరైనా బాగా ఆడితే వాళ్ళను హైప్ చేస్తారు అదేమన్నా మిస్ ఫైర్ ఐతే వాళ్ళను వదిలేసి ఇంకొకళ్ళతో టీమ్ ఐపోతారు. మీకు రెస్పెక్ట్ ఇచ్చి డెసిషన్ మేకింగ్ ఇస్తే మేము అన్ డిజర్వ్ అని రాశారు. అప్పుడే తెలిసింది మీరేంటి అన్నది సెల్ఫిష్ అని . కలిసి ఆడుతున్నప్పుడు మేము వాళ్ళతోనే ఆడేవాళ్ళం మా ఒపీనియన్ మార్చుకునే వాళ్ళం కాదు. అంతా గేమ్ గేమ్ గేమ్ కాదు. " అన్నారు నటరాజ్ - నీతూ. ఇక శివ్ - నటరాజ్ మాష్టర్ గట్టిగా జారీచేశారు. "విప్పినంత మాత్రాన పెద్దోళ్లమైపోతామా " అంటూ నటరాజ్ మాస్టర్ అనేసరికి ప్రియాంక ఫుల్ ఫైర్ అయ్యింది. "ఎం విప్పితే మాష్టర్ నాకు క్లారిటీ కావాలి" అని అడిగింది. "నోరు విప్పితే పెద్దోళ్ళం ఐపోతామా" అంటూ నీతూ క్లారిటీ ఇచ్చింది.
తర్వాత ప్రియాంక - శివ్ వెళ్లి నటరాజ్ - నీతూ మాష్టర్ 100 % బ్యాటరీ బ్లాక్ తీసేసి రివెంజ్ తీర్చుకున్నారు. ఇక ఈ రెండు జోడీస్ మధ్య వార్ జరిగింది. "అసలు ప్రియాంక పక్కన ఉంటె నా పారడైజ్ అన్నాడు ..ప్రియాంక తెచ్చిన ఫుడ్ ని ఇష్టం లేకుండా తిన్నాడు." అంటూ ఒక జోడి వల్ల ఇంకో జోడి ఓడిపోయినట్టు గట్టిగా మాట్లాడుకున్నారు.
![]() |
![]() |